రష్మికకు ఎమ్మెల్యే వార్నింగ్

9 months ago 7
ARTICLE AD

రష్మికకు తను పుట్టిన రాష్ట్రంలో అవమానం జరిగిందా? ఆ రాష్ట్రానికి ఇక వెళ్లకూడదని ఫిక్సయిందా? తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన కన్నడ సినీ ఇండస్ట్రీని రష్మిక ఎందుకు లైట్ తీసుకుంటుంది? వంటి ప్రశ్నలన్నీ రైజ్ అవుతున్నాయి తాజాగా అక్కడి ఎమ్మెల్యే ఒకరు ఆమెకు ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా వార్నింగ్? అంటే..

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన రష్మికా మందన్నా, ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. సౌత్‌ని కొన్నాళ్ల పాటు తన చేతుల్లో పెట్టుకుని, ఇప్పుడు నార్త్‌పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఆమెపై తన సొంత ఇండస్ట్రీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ మధ్య కాంతార సినిమాపై స్పందించలేదంటూ ఇండస్ట్రీ అంతా రష్మికను టార్గెట్ చేసింది. ఇప్పుడు బెంగళూర్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు గెస్ట్‌గా రమ్మని పిలిచినా, రానని చెప్పేసిందంటూ అక్కడి ప్రభుత్వం యమా సీరియస్‌గా ఉంది. దాదాపు ఆమెకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ. 

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ నటిగా పరిచయమై, స్టార్ స్టేటస్ అందుకున్న రష్మికను రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించాం. కానీ ఆమె రానని చెప్పేసింది. కర్ణాటక ఎక్కడో తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేసింది. మళ్లీ 10 సార్లు కబురు పెట్టాం. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు. దీనికి, ఆమెకు గుణపాఠం చెప్పాలి కదా! కచ్చితంగా రష్మికకు గుణపాఠం చెబుతామని పాండ్యా ఎమ్మెల్యే రవి గనిగ మీడియా ముందు హెచ్చరికలు జారీ చేశాడు. 

Read Entire Article