రవితేజ ఏంటీ స్పీడు

3 months ago 3
ARTICLE AD

మాస్ రాజా రవితేజ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసే హీరో. గత ఏడాది మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ తర్వాత భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేసారు. ఆ చిత్రం వినాయక చవితికి విడుదల కావాల్సి ఉండగా.. అది పోస్ట్ పోన్ అయ్యింది. అక్టోబర్ 31 మాస్ జాతర రిలీజ్ అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఈలోపే రవితేజ మరో సినిమా విడుదలకు సిద్దమవుతుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న రవితేజ నటిస్తున్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. రవితేజ మాస్ జాతర- కిషోర్ తిరుమల సినిమాని ఏక కాలంలో షూటింగ్ చేయడంతోనే అది కూడా మాస్ జాతర వచ్చిన రెండు నెలల్లో RT 76 థియేటర్స్ లోకి వస్తుంది అంటున్నారు. 

మెగాస్టార్, ప్రభాస్ ఇలా ఎవరొచ్చినా సంక్రాంతికి రవితేజ-కిషోర్ తిరుమల సినిమాని విడుదల చెయ్యాలనే కసితో మేకర్స్ ఉన్నారని, జనవరి 13 పై రవితేజ టీమ్  కన్నేసినట్లుగా తెలుస్తుంది. మరి మాస్ జాతర వచ్చిన రెండు నెలలకే మరో సినిమా అంటే రవితేజ స్పీడు మాములుగా లేదు అనే చెప్పాలి. 

Read Entire Article