రఫ్ఫాడిస్తున్న రాశీ

1 month ago 2
ARTICLE AD

అందాల క‌థానాయిక రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ కంటే ముంబై ప‌రిశ్ర‌మ‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తోంది. ఇటీవ‌ల వ‌రుస‌గా హిందీ చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది. రాజ్ అండ్ డీకే ఫ‌ర్జీ గ్రాండ్ స‌క్సెస్ సాధించాక రాశీ ఫోక‌స్ పూర్తిగా బాలీవుడ్ పైనే ఉంది. అయితే తెలుగు, త‌మిళంలో అవ‌కాశాల‌ను వ‌దులుకునేందుకు రాశీ సిద్ధంగా లేదు.  

తాజాగా రాశీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు రేపుతోంది. అంద‌మైన డిజైన‌ర్ శారీ, బ్లౌజ్ లో రాశీ ఎంతో ఛామింగ్ గా క‌నిపిస్తోంది. అందాల సుగుణ‌ రాశీ స్మైల్ ప‌రిస‌రాల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. ఫోటోషూట్ కోసం ఈ అందాల భామ ర‌కర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. అల్ట్రా స్టైలిష్, డిజైన‌ర్ గౌన్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాశీ ఖ‌న్నా ఇటీవ‌లే తెలుసు క‌దా? అనే చిత్రంలో న‌టించింది. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం నాలుగు చిత్రాల‌తో బిజీ బిజీగా ఉంది. వీటిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చాలా ముఖ్య‌మైన సినిమా. ఈ  చిత్రంలో రాశీ పాత్ర తీరు తెన్నుల గురించి ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఇంకా హింట్ ఇవ్వాల్సి ఉంది.  బ్రిడ్జ్, త‌లాఖోన్ మే ఏక్, 120 బ‌హ‌దూర్ లాంటి చిత్రాల‌తోను రాశీ బిజీ గా ఉంది.


Read Entire Article