Honda SP160 New Price After GST Reduction: తెలుగు రాష్ట్రాల్లో, 160cc విభాగంలోని బైక్‌లను కాలేజీ యువత & ఆఫీస్ రైడర్లు ఎక్కువగా వాడుతున్నారు. ఈ విభాగంలో అత్యంత విశ్వసనీయమైన & స్టైలిష్ బైక్ అయిన హోండా SP160, ఇప్పుడు GST 2025 కటింగ్‌తో మరింత దిగొచ్చింది. కొత్త 18% GST రేటు అమలు తర్వాత, దాని ధర రూ. 9,000 నుంచి రూ. 10,635 వరకు తగ్గింది. ఈ బైక్ ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ బయ్యర్ల బడ్జెట్‌లో మరింత సౌకర్యవంతంగా సరిపోతుంది. ఇది, ఈ మోటర్‌ సైకిల్‌ అమ్మకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చు, సేల్స్‌ పెరగవచ్చు.

హోండా SP160 కొత్త ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో... కొత్త ధరతో, హోండా SP160 సింగిల్-డిస్క్ వేరియంట్‌లో రూ. 1,12,906 రేటు వద్ద & డబుల్-డిస్క్ వేరియంట్‌లో ₹118,416 (ఎక్స్-షోరూమ్) రేటు వద్ద అందుబాటులో ఉంది. ఈ కొత్త ధరతో ఈ బైక్ TVS Apache RTR 160 & Bajaj Pulsar 160 వంటి యూత్‌ పాపులర్‌ బైక్‌లతో నేరుగా పోటీ పడుతుంది.

ఇంజిన్, మైలేజ్ & పనితీరు
హోండా SP160... పవర్ & ఇంధన సామర్థ్యం మధ్య పరిపూర్ణ సమతౌల్యం అందించేలా డిజైన్ అయింది. 162.71cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ మోటర్‌ సైకిల్‌ పని చేస్తుంది, ఇది 13.27 bhp & 14.58 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వేగంలోనూ స్మూత్‌ & సెన్సిటివ్‌ షిఫ్టింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్ BS6 ఫేజ్ 2 & OBD2B కంప్లైంట్‌తో, E20 ఇంధనానికి సూటవుతుంది. అంటే ఇది రాబోయే సంవత్సరాలలో కూడా సజావుగా నడపగలదు.

హోండా SP160 లీటరు పెట్రోలతో దాదాపు 50 km దూరం నడుస్తుంది & గంటకు దాదాపు 110 km గరిష్ట వేగంతో బాణంలా దూసుకెళుతుంది.

డిజైన్ & ఫీచర్లు
హోండా SP160 డిజైన్ స్పోర్టి & క్లాసిక్‌ల పరిపూర్ణ సమ్మేళనం. ఆధునిక రూపాన్ని & అత్యుత్తమ వినియోగదారు అనుభవాన్ని అందించే లక్షణాలతో కంపెనీ దీనిని డిజైన్‌ చేసింది. వేగం, గేర్ పొజిషన్‌, సగటు మైలేజ్ & ఇంధన స్థాయి వంటి అన్ని ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శించే 4.2 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రమెంట్‌ క్లస్టర్‌ ఈ బండికి ఉంది. LED హెడ్‌లైట్ & టెయిల్‌లైట్, సింగిల్-ఛానల్ ABS, USB-C ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ స్టాప్ స్విచ్, హజార్డ్ లైట్ బటన్ & సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

టీవీఎస్ అపాచీ & బజాజ్ పల్సర్‌తో పోటీ
మన మార్కెట్లో, హోండా SP160... టీవీఎస్‌ అపాచీ RTR 160 & బజాజ్ పల్సర్ N160 తో పోటీ పడుతుంది. Apache కొంచెం శక్తిమంతమైనది అయినప్పటికీ... హోండా SP160 లోని రీఫైన్డ్‌ పెర్ఫార్మెన్స్‌ & సాఫ్ట్‌ ఇంజిన్ కారణంగా రైడర్లకు ఇష్టంగా మారింది.

పల్సర్‌తో పోలిస్తే హోండా SP160 బైక్ నిశ్శబ్దంగా పని చేస్తుంది & మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ధర తగ్గింపుతో, హోండా SP160 ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ విలువైన బైక్‌గా మారింది. స్టైలిష్ లుక్స్, అధిక మైలేజ్, అధునాతన భద్రతలు & మృదువైన ఇంజిన్‌తో రోజువారీ ఉపయోగం కోసం నమ్మకమైన, సౌకర్యవంతమైన & సమర్థవంతమైన బైక్‌ను కోరుకునే హోండా SP160 సరైన ఎంపిక అవుతుంది.