మ్యారీడ్ బ్యూటీ స్ట‌న్నింగ్ లెద‌ర్ గౌన్

3 months ago 3
ARTICLE AD

అందానికి అందం, ప్ర‌తిభ, అద్భుత ఫ్యాష‌న్ సెన్స్‌తో నేటి జెన్ జెడ్ కి కూడా చెమ‌ట‌లు ప‌ట్టించేస్తుంది దీపిక ప‌దుకొనే. వ‌య‌సు 40కి చేరువైనా.. ఒక బిడ్డ‌కు మ‌మ్మీ అయినా, గ్లామ‌ర్ వ‌రల్డ్ లో త‌న‌కు ఎదురేలేద‌ని నిరూపిస్తోంది. భార‌త‌దేశంలో అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్న దీపిక‌, ఫ్యాష‌న్ ప్ర‌పంచాన్ని కూడా ఏల్తోంది.

కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్ స‌హా హాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాలు, ప్రీమియ‌ర్ల‌లో సంద‌డి ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో దీపిక ఎప్పుడూ ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాలోను హాట్ టాపిగ్గా మారుతుంది. అయితే ఈ క్వాలిటీస్ కార‌ణంగా ప్ర‌ఖ్యాత లూయీస్ వీట్ట‌న్ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా నియ‌మితురాలైంది. లూయీస్ వీట్ట‌న్ స్పెష‌ల్ ప్రైజ్ 2025 జూరీ సభ్యురాలిగాను ఎంపికైంది. ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ బ్రాండ్ ప్ర‌మోట‌ర్ గా ఎంపికైన‌ మొట్ట మొద‌టి భార‌తీయ న‌టిగా పేరు తెచ్చుకుంది. లూయీస్ వీట్ట‌న్ అంబాసిడ‌ర్ గా పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్ల స‌ర‌స‌న చేరింది దీపిక‌. దీపిక తాజాగా లూయీస్ వీట్ట‌న్ ల‌గ్జ‌రీ లెద‌ర్ బ్యాగ్ ప్ర‌మోష‌న్స్ కోసం ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ డిజైన‌ర్ లుక్  స్ట‌న్నింగ్ అని ప్ర‌శంసించాలి. ముఖ్యంగా చేతిలోని ఆ లెద‌ర్ బ్యాగ్ ని మించి దీపిక ధ‌రించిన డిజైన‌ర్ లెద‌ర్ డ్రెస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, దీపిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో అట్లీ తెర‌కెక్కిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో న‌టిస్తోంది. త‌దుప‌రి ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ రూపొందించే క‌ల్కి 2898 ఏడిలోను దీపిక న‌టించ‌నుంది. గ‌త కొంత‌కాలంగా తెలుగు సినిమాల‌తో బిజీ కావ‌డంతో దీపిక బాలీవుడ్ నుంచి తాత్కాలికంగా దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి షారూఖ్ ఖాన్ `కింగ్`లో అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read Entire Article