మౌఢ్యమి: 2026 అక్టోబరు 29 వరకు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

1 week ago 2
ARTICLE AD

Shukra Moudyami 2026: వేద జ్యోతిష్యశాస్త్రంలో గురు, శుక్ర గ్రహాల సంచారానికి, వాటి బలానికి విశేష ప్రాముఖ్యత ఉంది. వివాహాలు, శంఖుస్థాపన, గృహప్రవేశం, ఉపనయనం సహా ఏ శుభకార్యానికి అయినా, నూతన కార్యానికి అయినా ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఈ రెండు గ్రహాల స్థితిని పరిశీలిస్తారు. ఈ రెండు గ్రహాలు అస్తమయ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యం, నూతన కార్యం తలపెట్టరు. ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమైంది. పది రోజుల పాటూ..అంటే..అక్టోబర్ 29 వరకూ మౌఢ్యమి ఉంటుంది.ఇంతకీ మౌఢ్యమి అంటే ఏంటి? మౌఢ్యమి సమయంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? పండుగలు జరుపుకోవచ్చా? ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Baba Vanga Weekly Prediction 19 To 25 October: అక్టోబర్ 19 నుంచి 25 ఈ వారం అదృష్ట రాశులు ఈ 5, మీరున్నారా ఇందులో?

మౌఢ్యమి అంటే ఏమిటి?

మౌఢ్యమిని వాడుక భాషలో మూఢం అని పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఏ గ్రహం అయినా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహం ఆకాశంలో కనిపించదు..సూర్యకాంతి ప్రభావంతో ఆ గ్రహ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ స్థితిని ఖగోష పరిభాషలో గ్రహ అస్తమయం లేదా మూఢమి అంటారు. జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం అస్తమయం అయిన గ్రహం శుభాన్నివ్వలేదు. తన శక్తిని కోల్పోతుంది. ఇప్పుడు అక్టోబరు 19 నుంచి శుక్రుడు అస్తమయ స్థితిలో ఉన్నాడు.

నవగ్రహాల్లో శుక్రుడిని విలాసాధిపతి అంటారు. గురు,శుక్రులను శుభగ్రహాలుగా పవిత్రమైన గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు మౌఢ్యమి స్థితిలో ఉన్నప్పుడు గ్రహబలం శూన్యంగా మారుతుంది. అందుకే ఈ రోజుల్లో వివాహాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయనం, ప్రతిష్ఠ వంటి ముహూర్తబలం అవసరం అయ్యే నూతన శుభకార్యాలు నిర్వహించకూడనే నియమం ఉంది.

మౌఢ్యమి సమయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

అక్టోబర్ 19 నుంచి 29 వరకూ ఉన్న మౌఢ్యమి కాలంలో విజయదశమి పూజలు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. దసరా మాత్రమే కాదు మూఢమి సమయంలో ఏ పండుగలు వచ్చినా వాటిని ఆచరించుకోవచ్చు. కేవలం నూతన ప్రారంభోత్సవాలు, శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే పండుగలు మాసం, తిథి ఆధారంగా జరుపుకునే ధార్మిక పర్వదినాలు. శుభకార్యాలు ముహూర్తం ఆధారంగా నిర్ణయించేవి. అందుకే గ్రహబలం లేని సమయంలో జరిగే శుభకార్యం అశుభాన్నిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే నిత్యపూజలు, అభిషేకాలు, జపాలు, దోషశాంతులు, ప్రాయశ్చిత్త కర్మలు లాంటి కార్యక్రమాలు మూఢమి ఉన్నా కొనసాగించుకోవచ్చు.

మౌఢ్యమి సమయంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది?

మౌఢ్యమి సమయంలో శుభకార్యాలు, నూతన ప్రారంభోత్సవాలు చేస్తే దానివల్ల సంతోషం కాకుండా బాధ మిగులుతుందని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. పైగా ఊహించని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతారు. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన పనులుంటాయ్ వాటిని మౌఢ్యమితో ముడిపెట్టడం సరికాదంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎలాంటి పట్టింపులు లేనివారు నిరభ్యంతరంగా తమపని తాము చేసుకోవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు, అభిప్రాయాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఏ నమ్మకాలను లేదా సమాచారాన్ని ఆమోదించదని గమనించడం ముఖ్యం . ఏదైనా సమాచారం లేదా అభిప్రాయంపై చర్య తీసుకునే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

మేష, వృషభ రాశుల వారఫలాలు అక్టోబర్ 18 - 24 :  ఈ వారం మీ కెరీర్, ప్రేమ, ఆర్థిక పరిస్థితి ఎలా?

Read Entire Article