మోక్షజ్ఞ డెబ్యూ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

10 hours ago 1
ARTICLE AD

నందమూరి నటవారసుడు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై సోషల్ మీడియాలో వార్తలు రావడం తప్ప ఆ శుభముహుర్తానికి వేళ అవ్వడమే లేదు. బాలకృష్ణ ముహుర్తాలు అవి చూసి ఎనౌన్స్ చేసిన మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తో విభేదాలతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.

ఆతర్వాత ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని బాలయ్య చెబుతున్నా ఆ ముహూర్తం కోసం నందమూరి అభిమానులు వెయిటింగ్, ఘాటీ రిలీజ్ తర్వాత ముందునుకుట్టుగా ఆదిత్య 999 మూవీ దర్శకుడుగా క్రిష్ ఉంటారా అనే అనుమానాల నడుమ మోక్షు ఎంట్రీ విషయం ఆల్మోస్ట్ మరుగున పడిపోయినా అభిమానులు అప్పుడప్పుడు రేజ్ చేస్తూనే ఉన్నారు. 

రీసెంట్ గా గోవా ఫిలిం ఫిట్స్ లో బాలయ్య ఆదిత్య 999 మ్యాక్స్‌ తోనే మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ కానున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పై రచయిత సాయి మాధవ్ బుర్రా వర్క్ చేశారు. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిందని.. బాలయ్య కూడా ఆదిత్య 999 స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ సినిమా కథ దాదాపు బాలయ్య ఆలోచనలతోనే రైటర్ సాయి మాధవ్ బుర్రా పూర్తి చేశారని తెలుస్తోంది. 

అయితే వచ్చే ఏడాది జనవరి చివరి వారం లో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ తో మోక్షజ్ఞ ఎప్పుడు సెట్ పైన కనిపిస్తారో అని అభిమానులు వెయిటింగ్. 

Read Entire Article