మూలాలు మరిచిపోం.. బన్నీకి కౌంటరా!

11 months ago 7
ARTICLE AD

రాజమండ్రిలో జరిగిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మూలాలు అంటూ.. ఇన్ డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇచ్చారనేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా బన్నీని ఉద్దేశించి అన్నారా? లేదంటే ఆయనే స్వభావమే అది కాబట్టి అందరినీ గుర్తు చేసుకున్నారా? అనేది పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..

మన సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మరిచిపోలేం. అలాగే తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్‌గారిని, ఘట్టమనేని కృష్ణగారిని అందరినీ తలుచుకుంటాం. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం అన్నయ్య చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. మూలాలు మర్చిపోకూడదు కదా.. అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

ఈ మధ్య అల్లు అర్జున్ బిహేవియర్‌ని దృష్టిలో పెట్టుకునే కళ్యాణ్ ఈ కామెంట్స్ చేసి ఉంటారనేలా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్‌గా మీడియా అడిగినప్పుడు అల్లు అర్జున్‌ని వెనకేసుకొచ్చిన పవన్ కళ్యాణ్.. అసలు విషయం తెలిసి.. ఇప్పుడిలా చురకలు అంటించి ఉంటాడనేలా అయితే టాక్ నడుస్తుంది. 

Read Entire Article