మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సింధు

11 months ago 7
ARTICLE AD

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మూడు ముళ్ళు బంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త సాయి దత్తతో పీవీ సింధు వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటలోని లగ్జరీ రిజార్ట్స్ లో గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. డిసెంబర్ 22న ఆదివారం ఉదయ్‌పూర్‌ వేదికగా అత్యంత సన్నిహితుల నడుమ సింధు వివాహం ఘనంగా జరిగింది.

పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డెరెక్టర్‌ వెంటక దత్తతో సింధు ఏడడుగులు వేసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఈ పెళ్లికి 140 నుంచి 150 మంది అతిథులలు మాత్రమే హాజరైనట్టుగా తెలుస్తోంది. రేపు 24వ తేదీ అంటే మంగళవారం సింధు-సాయి దత్తల వెడ్డింగ్ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 

ఇరు కుటుంబ సభ్యుల నడుమ డిసెంబర్‌ 20న పీవీ సింధు సంగీత్‌ వేడుకలు, ఆ తర్వాత రోజు హల్దీ, పెళ్లి కూతురు, మెహందీ వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ లో జరగనున్న సింధు రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.  

Read Entire Article