మీకు మీ పాత ఇల్లు, చిన్నప్పుడు పెరిగిన ఊరు కల్లోకి వస్తోందా? దీని సంకేతం ఏంటో తెలుసా?

4 weeks ago 2
ARTICLE AD

Garuda Purana: ఏళ్ల క్రితం వదిలివచ్చిన ఇల్లు అకస్మాత్తుగా మన కలల్లో కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం దాని పెరట్లో కూర్చుని ఉన్నట్లు, మరికొన్నిసార్లు మనం బాల్యం గడిపిన గ్రామ వీధిలో ఉన్నట్లు కనిపిస్తాము. పితృ పక్షంలో ఇలాంటి కలలు పదేపదే వస్తుంటే, ఒక ప్రశ్న తలెత్తుతుంది: మన పూర్వీకులు మనల్ని గుర్తు చేసుకుంటున్నారా, లేక ఏదైనా అసంపూర్ణంగా మిగిలిపోయిందా? మత గ్రంథాలు మన పూర్వీకులకు సంబంధించిన కలల గురించి వివరిస్తాయి, కానీ కేవలం ఒక పాత ఇల్లు కనిపించడం అంటే మన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం కాదు.

పాత ఇంటి కల దేనిని సూచిస్తుంది?

పాత ఇల్లు అంటే కేవలం గోడలు, గదుల జ్ఞాపకం మాత్రమే కాదు. అది తల్లిదండ్రులు, తాతామామ్మలు, పండుగలు, కుటుంబంతో గడిపిన సమయంతో కూడా ముడిపడి ఉంటుంది. పితృ పక్షంలో ఆ వ్యక్తుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ ఇంటిని గుర్తుకు తెచ్చుకోవడం సహజం. ఈ జ్ఞాపకమే కలలకు ఒక కారణం కావచ్చు.

స్వప్నశాస్త్రం ప్రకారం..

భారతీయ స్వప్న సంప్రదాయం కూడా ప్రతి కల నుంచి భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయడాన్ని సమర్థించదు. చరక సంహితలోని ఇంద్రియస్థానం, చూసిన, విన్న , అనుభవించిన విషయాలతో పాటు, కోరిక ,  ఊహల ద్వారా కలిగే కలలను ప్రస్తావిస్తుంది. ఈ ఐదు రకాల కలలు నిష్ఫలమైనవిగా వర్ణిస్తారు. అంటే.. మీరు ఇదివరకే చూసిన ప్రదేశం గురించి కల కనడం వలన ఏదో జరగబోతోందని తప్పనిసరిగా అర్థం కాదు.

గరుడ పురాణంలో పితృదేవతల కలల సందర్భం ఏంటి?

గరుడ పురాణంలో ప్రేతఖండం, ఒక ఆత్మ తన పూర్వ నివాసానికి తిరిగి వచ్చి, నిద్రపోతున్న తన సంతానానికి సంకేతాలు ఇచ్చే దెయ్యపు స్థితిని వివరిస్తుంది. ఆరవ శ్లోకంలో... మరణించిన ఒక పూర్వీకుడు దీన స్థితిలో కనిపించి ఆహారం అడిగినట్లు ప్రస్తావనఉంది.  ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం ముఖ్యం. కలలలో పూర్వీకులను చూడటం వేరు, కేవలం పూర్వీకుల ఇంటిని చూడటం వేరు. పితృ పక్షంలో పాత గ్రామం గురించి కలలు రావడం అనేది పూర్వీకులు కోపంగా ఉన్నారని లేదా కుటుంబానికి కష్టాలు రాబోతున్నాయని సూచిస్తుందనే నియమం ఏదీ లేదు.

మీకు ఒక కల వస్తే ఏం చేయాలి?

మీరు మీ పూర్వీకుల గురించి ఆలోచిస్తుంటే, వారి గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం శ్రాద్ధం లేదా తర్పణం చేయండి. గరుడ పురాణంలోని ఈ అధ్యాయం నీటిని సమర్పించడం, మీకు వీలైనంత దానం చేయడం గురించి కూడా చెబుతుంది.

కేవలం ఒక కల వచ్చినంత మాత్రాన శ్రాద్ధ తేదీని మార్చడం, పితృ పాపాన్ని ఆపాదించుకోవడం, లేదా ఖరీదైన ఆచారాలు చేయడం వంటివి చేయనవసరం లేదని పండితులు చెబుతారు. మీ పాత ఇంటిని తలచుకోవడం అనేది మీ కుటుంబంతో ఉన్న అనుబంధానికి ఒక సంకేతం కావచ్చు. దానిని భయానికి లేదా దురదృష్టానికి సంకేతంగా భావించకూడదు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article