మిల్కీ బ్యూటీతో భాయ్ సెగ‌లు

2 weeks ago 2
ARTICLE AD

`జైల‌ర్`లో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించిన త‌మ‌న్నాను అప్ప‌ట్లో ఒక జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం షాకిచ్చింది.. అస‌లు లేట్ ఏజ్ హీరోల‌తో న‌టించ‌డానికి కార‌ణం ఏమిటి? అని అడిగితే, టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ హీరో 60 ప్ల‌స్ లో కూడా అంద‌మైన అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ, విమానాల్లోంచి జారిప‌డుతూ సాహ‌సాలు చేస్తున్నాడు. మ‌న హీరోలు అందుకు త‌క్కువేమీ కాదు! అంటూ పొగిడేసింది.

స‌రే.. త‌మ‌న్నా చెప్పిన‌దే నిజం అనుకుంటే, ఇక్క‌డ క‌నిపిస్తున్న లేట్ ఏజ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇప్పుడు త‌న వ‌య‌సులో స‌గం ఉన్న త‌మ‌న్నాతో రొమాన్స్ చేయ‌డం మ‌రోసారి చ‌ర్చ‌గా మారింది. అత‌డి అడుగులు త‌డ‌బడుతుంటే, ఆమె ఎంతో సాసీగా ఎన‌ర్జిటిక్ గా క‌నిపించింది. బ‌హుశా స‌ల్మాన్ కి వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌లు తీవ్ర‌త‌రం కావొచ్చు! అంటూ నెటిజ‌నులు తీవ్ర‌మైన కామెంట్లు చేస్తున్నారు. అత‌డి శ‌రీరం ఒణుకుతుంటే, ఆమె న‌వ‌న‌వ‌లాడుతోంది! అంటూ త‌మ‌న్నా య‌వ్వ‌నానికి కితాబిచ్చేస్తున్నారు. 

ఎరుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో త‌మ‌న్నా మిల్కీ వైట్ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. స‌ల్మాన్ అస‌లు త‌న శ‌రీరాన్ని క‌ద‌ప‌డానికే చాలా ఇబ్బందిప‌డుతున్నాడు ఇటీవ‌లి కాలంలో. స‌రిగ్గా 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చాక వృద్ధుడిగా మారాన‌ని అంగీక‌రించ‌డానికి అతడు సిద్ధంగా లేడు. అందుకే ఓల్డ్ మేన్‌తో మిల్కీ బ్యూటీ సింక్ లేదే అంటూ నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం  `ద‌బాంగ్` టూర్(దుబాయ్‌) లో స‌ల్మాన్ అందాల భామ‌ల‌తో చిద్విలాసాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఈ టూర్ లో సాహో బ్యాడ్ గాళ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఇస్తోంది.

 

Read Entire Article