మాటకు కట్టుబడి ఉన్నా-నాని

9 months ago 8
ARTICLE AD

టీడీపీ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత కేశినేని నాని విజయవాడ నియోజకవర్గంలో ఒకప్పుడు పవర్ ఫుల్ పొలిటీషియన్. కానీ ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి. ఉన్నట్టుండి కేశినేని నాని బీజేపీ లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు, అందుకే నితిన్ గడ్కరీని పొగిడేసాడు, మరో నెల రోజుల్లో కేశినేని బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అంటూ ఉన్నట్టుండి వార్తలు మొదలయ్యాయి. 

పురందరేశ్వరి లాంటి బీజేపీ నేతలతో కేశినేని నాని ఆయన అనుచరులతో కలిసి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ప్రచారం మొదలయ్యింది. ఆయన అనుచరులు కేశినేని నాని పై ఒత్తిడి చేస్తున్నారు, కాబట్టే నాని బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారని అన్నారు. గత ఎన్నికల ముందు టీడీపీని వదిలి వైసీపీ పార్టీలో చేరి 2024 ఎన్నికల్లో ఓడిపోయి జూన్ 10 న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించిన నాని పొలిటికల్ రీ ఎంట్రీ పై హాట్ హాట్ గా ప్రచారం మొదలైంది. 

తాజాగా తాను బీజేపీ లోకి వెళ్ళబోతున్నానే వార్తలకు చెక్ పెట్టారు నాని. రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చెయ్యాలనేమి రూల్ లేదు. . ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత , కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్న నాని, సమాజానికి త‌న‌ సే చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు అంటూ తన పొలిటికల్ రీ ఎంట్రీ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. 

Read Entire Article