భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం

3 weeks ago 4
ARTICLE AD
<p data-path-to-node="2">సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్&zwnj; నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం గ్రామంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. కన్నకూతురిపై మమకారం కన్నా భార్యపై ఉన్న పగ, పరువు పోతుందన్న ఆందోళనే ఎక్కువగా భావించిన ఓ తండ్రి, తన రెండేళ్ల కూతురి ప్రాణాలు తీశాడు. తన దగ్గరే ఉంటున్న కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చి హత్యచేశాడు. తండ్రి ప్రేమతో ఇస్తున్నాడని భావించిన ఆ చిన్నారి ఆ పండును తిని ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.&nbsp;ఈ దారుణానికి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలేనని పోలీసులు తెలిపారు.</p> <p data-path-to-node="3">లచ్చమ్మగూడెంకు చెందిన రవికి, రంగారెడ్డి జిల్లాకు చెందిన స్వాతికి మూడేళ్ల కిందట వివాహం కాగా, వీరికి సంతానం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా 3 నెలల కిందట స్వాతి చిన్న కుమార్తె మయూరి(9 నెలల)ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోగా, పెద్ద కుమార్తె మేఘన తండ్రి రవి వద్దే ఉంటోంది. అయితే, పెద్ద కుమార్తెను కూడా తన వద్దకు పంపాలని స్వాతి పోలీసులను ఆశ్రయించడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. పెద్ద కూతురు తనకు దూరం అవుతుందని ఓవైపు, భార్యపై కోపంతోనూ రవి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.</p> <p data-path-to-node="4">&nbsp;సపోటా పండులో విషం కలిపి ఇచ్చిన తర్వాత, చిన్నారి వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రవి కూడా నిద్రమాత్రలు, ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు రవిని నల్గొండకు, మేఘనను హైదరాబాద్&zwnj; నిలోఫర్&zwnj; ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మేఘన సోమవారం చనిపోయింది.&nbsp; మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా, తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకం తెలియని ఒక పసి ప్రాణం తండ్రి చేతిలోనే బలైపోవడం స్థానికులను సైతం తీవ్ర ఆవేదనకు గురిచేసింది.&nbsp;</p>
Read Entire Article