భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం

1 month ago 6
ARTICLE AD
<p>ఏదులాపురం: భర్త మద్యానికి బానిసయ్యాడని, అనారోగ్యంతో త్వరలోనే చనిపోతాడని భావించి భార్యే అతడిపై భారీ ఇన్సూరెన్స్ చేయించింది. అయితే ఏడాది గడిచినా అతను చనిపోకపోవడంతో, ఆ ఇన్సురెన్స్ నగదు కోసం బంధువుల సాయంతో వివాహిత తన భర్తను హత్య చేయించింది. ప్లాన్ చేసి భర్తను హత్య చేయించిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఖమ్మం రూరల్ సీఐ ముష్కరాజు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.</p> <p>ఖమ్మం నగరంలోని గాంధీనగర్&zwnj;కు చెందిన చాగంటి రవి (42) ఆటో డ్రైవర్&zwnj;గా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం కిందట మద్యానికి బానిసైన రవి తరచూ భార్య ప్రశాంతితో గొడవపడేవాడు. భర్త మద్యం తాగే తీరు, బలహీనత గమనించిన భార్య ప్రశాంతి.. అతను ఎలాగో చనిపోతాడని భావించి ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడి భర్త రవి పేరిట ఇన్సూరెన్స్ చేయించింది. ఏడాది దాటినా రవి ఇంకా చనిపోవడం లేదని ఆమెలో ఆలోచన మొదలైంది. భర్త ప్రాణాలతోనే ఉండటంతో భార్య ప్రశాంతి తన బంధువు దేశపోయిన శ్రీనివాస్ సాయంతో అతడిని అంతమొందించాలని భావించింది. పైగా హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే ఇన్సూరెన్స్ నగదు సులభంగా వస్తుందని వారు కుట్ర చేశారు.</p> <p>మార్చి 2న శ్రీనివాస్ తన ఆటోలో చాగంటి రవిని తీసుకెళ్లి, ఎంవీపాలెం సమీపంలో మద్యం తాగించి రోడ్డు పక్కన వదిలేశాడు. తమ ప్లాన్ ప్రకారం, జోగి రాజ్&zwnj;కుమార్ అనే వ్యక్తి కారుతో రవిని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి హత్య చేశాడు. ఈ హత్యలో మరికొందరు కూడా సహకరించారు. అనుమానాస్పద మృతికేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ జరపడంతో ఈ ఘోరం బయటపడింది. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్&zwnj;కు తరలించగా, పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు ప్రశాంతిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.</p>
Read Entire Article