బెడ్ రూమ్ విష‌యాలు హాల్ వ‌ర‌కూ

3 weeks ago 2
ARTICLE AD

ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఫ‌ర్టిలిటీ సెంట‌ర్లు పెరిగిపోవ‌డానికి కార‌ణం ఏమిటి?  దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం అనే పెను స‌మ‌స్య అంత‌కంత‌కు పెరుగుతుండ‌టం వ‌ల్ల‌నే. ఇటీవ‌ల ఆర్థిక స‌మ‌స్య‌లు, లైఫ్ స్టైల్ స‌మ‌స్య‌ల‌తో యువ‌త‌రం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీని కార‌ణంగా కూడా పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

అయితే సంతాన స‌మ‌స్య భార్య భ‌ర్త ఇద్ద‌రిలో ఎవ‌రితో ముడిప‌డిన‌ది అంటే? ఇద్ద‌రికీ సంబంధించిన స‌మ‌స్య‌. కానీ ఆడ‌వారి చుట్టూనే ఈ స‌మ‌స్య‌ను ముడి వేస్తార‌ని అంటున్నారు న‌టి చాందిని చౌద‌రి. ఈ తెలుగ‌మ్మాయి న‌టించిన `సంతాన ప్రాప్తిర‌స్తు` చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్రీరిలీజ్ వేడుక‌లో చాందిని మాట్లాడుతూ.. పిల్ల‌లు పుట్ట‌కపోవ‌డం అనే స‌మ‌స్య కార‌ణంగా ఇబ్బ‌డి ముబ్బ‌డిగా సంతాన సాఫ‌ల్య కేంద్రాలు పుట్టుకొస్తున్నాయ‌ని, ఈ స‌మ‌స్య‌ను బ‌య‌ట‌కు చెప్పుకునేందుకు దంప‌తులు సిగ్గుప‌డతార‌ని, ఎదుటి వారు ఏమ‌నుకుంటారోననే ఆందోళ‌న‌తో ఉంటార‌ని కూడా చాందిని అన్నారు. అయితే తాను న‌టించిన సంతాన ప్రాప్తిర‌స్తు చిత్రంలో మేల్ ఫెర్టిలిటీ గురించి చ‌ర్చించ‌డం కొత్త‌గా ఉంటుంద‌ని తెలిపారు. సాఫ‌ల్యం అనేది పురుషుడికి సంబంధించిన‌ది అనే కొత్త పాయింట్ ని ఈ చిత్రం చ‌ర్చిస్తుంద‌ని తెలిపారు. బెడ్ రూమ్ విష‌యాలు హాల్ వ‌ర‌కూ వ‌స్తున్నాయ‌ని కూడా చాందిని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో విక్రాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించారు. మ‌ధురాశ్రీ‌ధ‌ర్, నిర్వి ప్ర‌సాద్ నిర్మించారు.


Read Entire Article