బాలయ్య-హరీష్ శంకర్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్

2 months ago 6
ARTICLE AD

నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ 2 తాండవం తర్వాత గోపీచంద్ మలినేని తో తో NBK 111 ని అనౌన్స్ చేసారు. ముందుగా అనుకున్న పిరియాడికల్ కథకు బడ్జెట్ ప్రోబ్లెంస్ తలెత్తడంతో.. మరో ఫ్రెష్ కథను రాసుకుని గోపీచంద్ మలినేని బాలయ్య తో ఓకే చేయించుకున్నారు. పక్కా ఫ్యామిలీ, కమర్షియల్ ఎలిమెంట్స్ తో NBK 111 ఉండబోతుంది అంటూ గోపీచంద్ చెప్పారు.

మార్చ్ నుంచి NBK 111 పట్టాలెక్కేందుకు సిద్దమవుతుంది. తాజాగా బాలయ్య కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ చెప్పి ఒప్పించారు, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతను సంస్థ సితార బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తారనే టాక్ వైరల్ గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ తో మార్చి 26 న ప్రేక్షకుల రాబోతున్న హరీష్ శంకర తన తదుపరి చిత్రం బాలయ్య తో కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

బాలయ్య-హరీష్ శంకర్-నాగవంశీ కాంబో ఫిలిం ఆల్మోస్ట్ కన్ ఫర్మ్, త్వరలోనే అఫీషియల్ అనౌన్సమెంట్ రాబోతుంది అంటున్నారు. సో బాలయ్య NBK 112 కూడా లైన్ లోకి వచ్చేసింది, మరి ఆదిత్య 999 మేటరే తేలడం లేదు. 

Read Entire Article