బాబు-లోకేష్ సంకల్పం నెరవేరుతుందా

1 month ago 6
ARTICLE AD

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓ సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేసింది. అలానే ఏపీలో ఈ నిబంధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కు తెరలేపిన ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సోషల్ మీడియాపై కీలక ప్రకటన చేసింది.

13 ఏళ్ల వయసులోపు ఉన్నవారికి సోషల్ మీడియా వాడకం అందుబాటులో లేకుండా చూస్తాం, 13 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండేలా చర్యలు చేపడతామని, 90 రోజుల్లో దీనిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని చంద్రబాబు ప్రకటన చేసారు. 

నిజంగా ఏపీలో సోషల్ మీడియా ని 13 ఏళ్ళ పిల్లలు చూడకుండా బ్యాన్ చెయ్యగలిగితే ఇది మాములు విషయం కాదు. ఇది గనక సాధ్యమైతే గనక కొత్తవరవడి కి శ్రీకారం చుట్టినట్టే. మరి చంద్రబాబు, నారా లోకేష్ ల సంకల్పం నెరవేరుతుందా.. 

Read Entire Article