బ‌న్నీ కోసం దేవ‌ర కంటే ది బెస్ట్ ఆల్బ‌మ్

2 months ago 7
ARTICLE AD

టాలీవుడ్ స్టార్ హీరోలు ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ -యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మధ్య ఓ  ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. వీరిద్దరి చిత్రాలకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప‌ని చేయ‌డ‌మే అందుకు కార‌ణ‌మైంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇప్ప‌టికే ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర` సినిమాకు అనిరుద్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.  మంచి మ్యూజిక‌ల్ గా హిట్ అయిన చిత్ర‌మ‌ది. ఆ సినిమాకు అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం అంతే గొప్ప‌గా అందించాడు.

దీంతో అనిరుద్ ఇమేజ్ టాలీవుడ్ లో రెట్టింపు అయింది. అవ‌కాశాలు కూడా పెరిగాయి. ప్ర‌స్తుతం ప‌లు తెలుగు సినిమాల‌కు అనిరుద్ బాణీలు స‌మ‌కూర్చుతున్నాడు. తాజాగా బ‌న్నీ హీరోగా లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రిఆనికి కూడా అనిరుద్ ఎంపిక‌య్యాడు. దీంతో ఈ కాంబినేష‌న్ పై  పరిశ్రమలో భారీ బ‌జ్ నెల‌కొంది.

అనిరుద్  మాస్ పల్స్- పాటల ప‌రంగా బ‌న్నీ టేస్ట్ మిక్స్ అయితే అది వేరే లెవ‌ల్లో ఉంటుంది. ఈ ఇద్దరి కలయిక లో  బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌కు అవ‌కాశం ఉంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో వచ్చిన మ్యూజిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పూర్తిస్థాయిలో సంగీత పనులు మొదలవ్వకముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రారంభమైన తర్వాత అనిరుధ్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తారని అందరూ నమ్ముతున్నారు. అయితే `దేవ‌ర‌` కంటే మెరుగైన సంగీతం బ‌న్నీ సినిమాకు ఇస్తాడా?  అన్న చ‌ర్చ  నెట్టింట జ‌రుగుతోంది.  ఇప్ప‌టికే లోకేష్ సినిమాల‌కు సంగీతం అందించిన అనుభ‌వం అనిరుద్ కి ఉంది. లోకేష్ ఎలాంటి పాట‌లు కోరుకుంటాడు? అత‌డి టేస్ట్ ఎలా ఉంటుంది? అన్న దానిపై అనిరుద్ కి ఐడియా ఉంది.  అలా తెలిసిన‌ప్పుడు ది బెస్ట్ ఆల్బ‌మ్ కు అవ‌కాశం ఉంటుంది.

Read Entire Article