ఫోన్ నెంబర్లు లీక్ చెస్తామంటూ ఐబొమ్మ బెదిరింపు

2 months ago 3
ARTICLE AD

ప్రస్తుతం పైరసీ భూతాన్ని తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైం చర్యలు తీసుకుంటుంది. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు త‌మిళ్ రాక‌ర్స్ ని మించిన పైర‌సీ మాఫియా గుట్టు రట్టు చేసారు. ఫైనల్ గా అతి త్వరలోనే సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి తమ సైట్ లో అప్ లోడ్ చేస్తూ నిర్మాతలకు భారీ నష్టం కలిగిస్తున్న ఐ బొమ్మ పని పడతామని పోలీసులు హెచ్చరించారు.  

పోలీసులు ఐ బొమ్మ ను హెచ్చరించడం కాదు.. పోలీసులకు ఐ బొమ్మ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన చేసింది. ఒకవేళ పోలీసులు వెబ్‌సైట్‌ బ్లాక్‌ చేస్తే.. మీ ఫోన్‌ నంబర్లు బయటపెడతామంటూ సినిమా పరిశ్రమను బెదిరిస్తూ ప్రకటన చెయ్యడం కలకలం సృష్టించింది. 

5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరించడమే కాదు, మీడియా, OTT, అలాగే హీరోలకు సంబంధించి షాకింగ్ విషయాలు రివీల్ అవుతాయి. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. దేనికి వెనక్కి తగ్గేదేలేదు అంటూ ఐ బొమ్మ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలంగా మారింది. 

Read Entire Article