ఫైనల్ గా మెగా బ్రదర్ కి మంచి రోజులు

9 months ago 7
ARTICLE AD

తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం పని చేస్తూ.. ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే పార్టీని బలోపేతం చేసే క్రమంలో సినిమాలను కాస్త పక్కన పెట్టి తమ్ముడు పవన్ కళ్యాణ్ నే నమ్ముకున్న నాగబాబు కు ఇప్పటివరకు పార్టీ పరంగా ఎలాంటి న్యాయము జరగలేదు. అంటే జనసేన పార్టీ లో నాగబాబుకు సముచిత స్థానమే ఉన్నా ఆయనకు మిగతా ఏ విధంగానూ లాభం లేదు. 

ఆ మద్యన రాజ్యసభకు నాగబాబు ను పంపించేందుకు పవన్ ఢిల్లీ వేదికగా గట్టి ప్రయత్నాలే చేసినా.. అక్కడ కూటమి ప్రభుత్వ పోత్తుకు లోబడి అన్న నాగబాబు ను పవన్ పక్కనపెట్టాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సీటు కోసం నాగబాబు కు బాబు-పవన్ అన్యాయం చేసారు. కానీ చంద్రబాబు పవన్ కు నాగబాబు విషయంలో హామీ ఇచ్చారని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. 

తాజాగా నాగబాబుకు మంచి రోజులొచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఫైనల్లీ సముచిత స్థానం దక్కబోతోంది అంటున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా సభలో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు.  ఎమ్యెల్సీ అయిన మరుక్షణమే ఏపీ క్యాబినెట్ లో నాగబాబు కు మంత్రి పదవి రెడీగా ఉంటుంది అంటున్నారు. 

ఈసారి ఖచ్చితంగా నాగబాబు మినిస్టర్ అవుతారని, ఈ విషయంలో చంద్రబాబు కూడా భరోసాగా ఉన్నారు, అటు పవన్ కి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నట్టుగా అవుతుంది అంటున్నారు. మరి ఈసారైనా మెగా బ్రదర్ మినిస్టర్ అయ్యి హోదా చుపిస్తారేమో చూడాలి. 

 

Read Entire Article