ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

9 months ago 8
ARTICLE AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఏముంటుంది అనుకుంటున్నారా, ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న కాంబో కి ఫైనల్ గా ముహూర్తం కుదిరింది. అదే యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చెయ్యాల్సిన స్పిరిట్ మూవీ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 

స్పిరిట్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ కి ఇచ్చిన బిగ్గెస్ట్ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఉగాది రోజున అంటే మార్చ్ నెలాఖరున స్పిరిట్ పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కాబోతుంది అని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇచ్చిన అప్ డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. నెగెటివ్ రోల్ లో ఇంటెర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో స్పిరిట్ కథ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కరీనా ను అనుకుంటున్నారు. ఆ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

Read Entire Article