పోసాని కృష్ణమురళికి రిమాండ్

9 months ago 7
ARTICLE AD

బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని మై హోమ్ భుజ లో అరెస్ట్ అయిన నటుడు పోసాని కృష్ణమురళి ని నిన్న ఏపీ పోలీసులు రాజం పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిన్న రాత్రి కోర్టులో పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టగా.. ఆయనకు రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

గత రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్‌ ఉదయం 5:30 గంటలకు తీర్పు వెల్లడించారు. పోసానికి మార్చ్ 13 వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. 

పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని ప్రస్తుతం పోలీస్ ల అదుపులో ఉన్నారు. కోర్టు తీర్పు తర్వాత రాజంపేట సబ్‌జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు. 

Read Entire Article