పేరెంట్స్ చూసిన అబ్బాయికి త్రిష ఒకే!

1 month ago 2
ARTICLE AD

అందాల త్రిష ఇంకా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ్యాపార వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్ తో నిశ్చితార్దం...అటుపై వీగిపోవ‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచి త్రిష ప్రేమ‌..పెళ్లి అనే ఆలోచ‌న లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగ‌ని ధాంప‌త్య జీవితానికి తానెంత మాత్రం వ్య‌తిరేకం కాద‌ని..మ‌న‌సుకు న‌చ్చిన అబ్బాయి దొరికితే త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామిస్ చేసింది. అయితే ఇప్పుడా ప్రామిస్ నిల‌బెట్టుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. 

ఇటీవ‌లే త్రిష త‌ల్లిదండ్రులు చండీఘ‌ర్ కు చెందిన ఎన్ ఆర్ ఐ  సంబంధం చూసిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అత‌డు ఆస్ట్రేలియాలో వ్యాపార వేత్త అని..కొత్త‌గా ఇండియాలో కూడా వ్యాపారాన్ని విస్త‌రించే ప‌నిలో ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఆ కుటుంబంతో త్రిష త‌ల్లిదండ్రుల‌కు ఎంతో కాలంగా స‌త్ససంబంధాలు ఉండ‌టంతో? ఆ కుర్రాడిని సెట్ చేస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ త్రిష ఒకే చెప్పిందా?  లేదా? అన్న‌ది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఆ బిజినెస్ మ్యాన్ కి త్రిష ఒకే చెప్పిన‌ట్లు  వినిపిస్తోంది.

కుర్రాడు అంద‌గాడు కావ‌డం స‌హా త‌ల్లిదండ్రుల మాట‌కు క‌ట్టుబ‌డి త్రిష కూడా ఒకే చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇదే నిజ‌మ‌తై త్రిష సింగిల్ లైఫ్ కి పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే. ఇప్ప‌టికే త్రిష కు 42 ఏళ్లు నిండాయి. పెళ్లి విష‌యంలో సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కోంటుంది. తాజా ప్ర‌చారంతో వాట‌న్నింటికి పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే. త్రిష కూడా న‌టిగా ఇప్పుడంతా బిజీగా లేదు. తెలుగులో ఒక సినిమా, త‌మిళ్ లో ఓ సినిమా చేస్తుంది. ఈ రెండు మిన‌హా కొత్త అవ‌కాశాలేవి లేవు.

ఈ రెండు విజ‌యాలు సాధిస్తే త‌ప్ప కొత్త ఛాన్సులు అందుకునే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. న‌టిగా సౌత్ లో ఆమె సాధించాల్సింది కూడా ఏమీలేదు. రెండు భాష‌ల్లోనూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్ ని సైతం ట‌చ్ చేసింది. అయితే సోలో నాయిక‌గా మాత్రం స‌త్తా చాట లేక‌పోయింది. ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు కొన్ని చేసినా? ఫ‌లించ‌లేదు.

Read Entire Article