పెద్ది సాంగ్: రామ్ చరణ్ స్టెప్స్ - జాన్వీ అందాలు

4 weeks ago 2
ARTICLE AD

రామ్ చరణ్ - జాన్వీ కపూర్ కాంబోలో బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తోన్న మోస్ట్ రస్టిక్ యాక్షన్ డ్రామా పెద్ది. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అంటూ ప్రోమోతోనే లిరికల్ వీడియోపై భారీ అంచనాలని పెంచారుమేకర్స్. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ ని రిలీజ్ చేసి ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచారు.

పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడ్ని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని ప్రతి క్షణం డాన్స్ స్టెప్స్ తో పండగ చేసుకుంటాడు. రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్ కి పోటీగా జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన ఉంది. 

రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూవ్స్, ఆయన ఎక్స్‌ప్రెషన్స్, రిథమ్, హ్యాపీనెస్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వున్నాయి. ఆయన హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ప్రేమను సెలబ్రేట్ చేస్తున్న అనుభూతి ఇస్తోంది. జాన్వీ కపూర్ ఇంట్రో షాట్ ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆమె దీపాన్ని ఎత్తి తన లుక్‌ని రివీల్ చేసే సీన్ మ్యాజిక్ లా ఉంది. ఆమె గ్రేస్, చార్మ్ అద్భుతంగా వుంది.

చికిరి చికిరి పాట ట్యూన్, లిరిక్స్, విజువల్స్, ఎనర్జీ అన్నీ కలిపి చికిరి చికిరిను నెక్స్ట్ పాన్-ఇండియా వైరల్ సాంగ్‌గా నిలబెట్టాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ ఛాలెంజ్‌లకు ఇది పర్ఫెక్ట్ సాంగ్. చికిరి పెద్ది మ్యూజికల్ జర్నీకి బ్లాక్‌బస్టర్ స్టార్ట్ ఇచ్చింది.

Read Entire Article