పుష్పాగాడు.. కొట్టాడయ్యా తిరుగులేని రికార్డు

10 months ago 7
ARTICLE AD

డిసెంబరు 4న ప్రీమియర్ షోస్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌పై మొదలైన పుష్ప రాజ్‌గాడి రూలింగ్.. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ దూసుకెళుతూనే ఉంది. కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును పుష్ప 2 ది రూల్ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా 32 రోజుల్లో రూ. 1831 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి.. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా తన పేరు మీద రికార్డును క్రియేట్ చేసింది. అంతకు ముందు ఈ రికార్డ్ రూ. 1810 కోట్లతో బాహుబలి-2 పేరు మీద ఉంది. ఇప్పుడా రికార్డును కూడా పుష్ప రాజ్ చెరిపేశాడు.

మరోవైపు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు రూ. 800 కోట్ల ప్లస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒక్కటని కాదు.. సినిమా విడుదలైన రోజు నుండి ఏదో ఒక రికార్డును పుష్ప 2 సినిమా రాసుకుంటూనే వెళుతోంది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, అల్లు అర్జున్- రష్మికల నటనా పటిమ ఈ సినిమా పేరుపై రికార్డులు నెలకొనేలా చేస్తోంది. చూస్తుంటే ఈ ఊపులో రెండు వేల కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదనేలా.. బాక్సాఫీస్ షేకవుతోంది.

సుకుమార్‌ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర సక్సెస్, కలెక్షన్లతో చిత్రయూనిట్ మొత్తం హ్యాపీగా ఉంది.

Read Entire Article