ARTICLE AD
మహాజన రాజేష్ ఎప్పుడు ఎవరికి ఫేవర్ గా మాట్లాడతాడో, లేదంటే ఎప్పుడు తన అనుకున్నవారిని తిడతాడో ఎవరికి ఓ పట్టాన అర్ధం కాదు. జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి గెలవడం రాజేష్ కి అస్సలు ఇష్టం లేదు. తనకి జనసేన వలనే ఎమ్యెల్యే సీటు దక్కలేదనే అసహనం రాజేష్ లో కనిపిస్తుంది. అందుకే జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ లో హడావిడి చేస్తూ ఉంటాడు.
తాజాగా మహాసేన రాజేష్ మరోమారు పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా తప్పించి లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చెయ్యాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. నారా లోకేష్‌ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి, 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టాలు పడ్డాడు.. అవమానాలు పడ్డాడు, నారా లోకేష్ యువగళం పాదయాత్ర, అతను పడ్డ కష్టం వల్లే 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి
లోకేష్ అభిమానులుగా ఆయన్ని ఓ మినిస్టర్ గా మాత్రమే చూడడం మాకు నచట్లేదు, లోకేష్ ని త్వరగా డిప్యూటీ సీఎం ని చేయమంటూ డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఏం చెయ్యాలని రాజేష్ ఉద్దేశ్యం, ఆయన్ని తప్పించి లోకేష్ కి ఆ సీటు కట్టబెట్టాలనేగా అతని డిమాండ్.

10 months ago
8