పవన్ కొడుకు అకీరా ఎంట్రీ పై క్రేజీ న్యూస్

9 months ago 9
ARTICLE AD

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపే పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు మధ్య మధ్యలో తనకిష్టమైన ఆధ్యాత్మికతతో పరుగులు పెడుతున్న పవన్ కళ్యాణ్.. తన వారసుడు అకీరా ను హీరోగా ఎప్పుడు తెరంగేట్రం చేపిస్తారో అనే విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా అతృతతో ఉన్నారు. 

అందులోను పవన్ పక్కన అకీరా కనిపించినప్పుడల్లా ఆ ప్రశ్న రేజ్ అవుతుంది. 2024 ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగరేసినప్పుడు కొడుకు అకీరా ను వెంటబెట్టుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు తనతో పాటుగా దేవాలయాల సందర్శనానికి తీసుకెళ్లారు. అంతేకాదు నిన్న మంగళవారం కుంభమేళాలో కొడుకు అకీరాతో కలిసి త్రివేణి సంగమం వద్ద స్నానమాచరించి పూజలు నిర్వహించారు. 

అకీరా కటౌట్ చూసినప్పుడల్లా పవన్ ఫ్యాన్స్ లో అకీరా సినీ ఎంట్రీ విషయంలో పవన్ పై ఒత్తిడి పెంచుతున్నారు. అందులోను పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేసి ఇకపై సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అనే వార్తల నేపథ్యంలో అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తే బావుంటుంది అనేది పవన్ ఫ్యాన్స్ ఆలోచన. 

కానీ అకీరా ఎంట్రీకి రెండేళ్లు సమయం పట్టొచ్చు అంటున్నారు. అకీరా ను హీరో గా ఎంట్రీ ఇప్పించేందుకు బాధ్యత తీసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి మాదిరి కనబడుతున్న అకీరా ఈ రెండేళ్లలో ఇంకెంత మేకోవర్ చూపిస్తాడో అంటూ అప్పుడే పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 

Read Entire Article