ARTICLE AD
ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి త్వరలోనే త్వరలోనే అంటూ చెబుతున్నారు కానీ.. తాజాగా స్మృతి మంధాన తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా లోని ఇన్స్టా ప్లాట్ ఫామ్ నుంచి అధికారికంగా ప్రకటించింది. పరాస్ నిశ్చల్ ని నవంబర్ 23 న వివాహం చేసుకోవాల్సిన స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లిని వాయిదా వేసుకుంది అన్నారు.
ఆతర్వాత పరాస్ నిశ్చల్ హాస్పిటల్ పాలవడం, స్మృతి మంధాన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ తీసెయ్యడం, సోషల్ మీడియా నుంచి పెళ్ళికి సంబందించిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ వీడియోస్, ఫొటోస్ డిలేట్ చెయ్యడం, ఆతర్వాత పరాస్ నిశ్చల్ తల్లి స్మృతి మంధాన-పరాస్ వివాహం ఆగలేదు, త్వరలోనే అంటూ చెప్పడం అన్ని హైలెట్ అయ్యాయి.
అయితే తాజాగా స్మృతి మంధాన, పరాస్ తో తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంలో రెండు కుటుంబాల ప్రైవసీ ని గౌరవించాలని కోరుతున్నట్టుగా ఆమె పోస్ట్ పెట్టింది.

7 hours ago
1