నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!

1 month ago 2
ARTICLE AD

గడిచిన రెండు రోజులుగా  ఏపీ విపత్తు నిర్వహణల శాఖ, ప్రభుత్వం, వాతావరణ కేంద్రం చేసిన కృషి ఫలించింది అనే చెప్పాలి. కొంతమంది ప్రభుత్వం అతి చేస్తుందా అన్నట్టు విమర్శలు గుప్పించే ప్రయత్నం చేసినా             " మెంథో " తుఫాన్ గండం నుండి చాలా తక్కువ నష్టం తో ఏపీ బయట పడింది అంటే నిజంగా అది వివిధ శాఖల సంయుక్త నిర్వహణే అని ఒప్పుకుని తీరాలి.

3645 మంది గర్భిణీలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు

రాష్ట్ర వ్యాప్తంగా 1906 షెల్టర్ లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నెలలు నిండిన 3645 మంది గర్భిణిలను ముందుగానే ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. దుబ్రిగుంట మండలంలో సాకేరి అనిత అనే గర్భిణీ కి ప్రసవ వేదన రావడం తో సురేష్ అనే 108 సిబ్బంది స్వయంగా తన చేతుల మీదుగా పొంగుతున్న వాగు దాటించి ఆమెను కాపాడిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

అడుగడుగునా హెచ్చరిక లు జారీ చేసిన  విపత్తు నిర్వహణ ల శాఖ

విరుచుకు పడుతున్న తుఫాన్ గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ  మరివైపు ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేస్తూ వచ్చింది ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ. అంతేకాకుండా తగినన్ని SDRF, NDRF బృందాలు తీర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి మకాం వేశాయి. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న ఏరియాల నుండి  ప్రజలను తరలించి రక్షిత కేంద్రాలకు చేర్చాయి. దీనివల్ల తుఫాను కారణంగా ప్రాణ నష్టం  అత్యంత అల్పం గా ఉండేలా జాగ్రత్త పడ్డారు.  విరిగిన చెట్లను అప్పటికప్పుడే కట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసారు.

1000 విద్యుత్ బృందాలు.. 11 వేలమంది నిరంతరం పనిలో

తుపాను కారణంగా వివిధ చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, ట్రాన్స్ ఫార్మర్లు పాడవడంతో 28,083 సర్వీసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. అయితే వాటిలో 21,057 సర్వీసులకు విద్యుత్ సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు. వివిధ ప్రాంతాల్లో స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ లైన్లపై చెట్లు కూలడంతో తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో 246 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడితే అర్ధరాత్రికి కల్లా 197 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించేందుకు మూడు డిస్కంల పరిధిలో 1,000 బృందాలు పనిచేస్తున్నాయనీ.సుమారు 11,761 మంది వివిధ చోట్ల నిరంతరాయం గా పనులు నిర్వహిస్తున్నారనీ.. కావలసిన సామాగ్రిని ఆయా గ్రామాలకు ముందు నుండే తరలించిన అధికారులు  విద్యుత్ అంతరాయం  తక్కువ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంటింటికీ స్వయంగా తిరిగిన అధికారులు

ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  ప్రాంతాల్లో MRO స్థాయి అధికారులు స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. వీలైనంత మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. ఇక కలెక్టర్ రేంజ్ అధికారులు అయితే  ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు పరిస్థితి ని సమీక్షిస్తూ వచ్చారు.  విశాఖపట్నం, విజయవాడలాంటి సిటీల్లో పోలీస్ కమీషనర్ లు ముందుగానే కొండఛరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను  హెచ్చరిస్తూ స్వయంగా తిరిగారు.

అర్ధరాత్రి వరకూ సెక్రటె్రియేట్ లోనే  చంద్రబాబు, తెల్లవార్లూ RTGS లోనే లోకేష్

2014 లో " హుద్ హుద్ " అనుభవం తో  "మొoథా"  తుఫాన్ నష్టం వీలైనంత తక్కువగా ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్వయంగా సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీయం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత. ఇతర అధికారులతో పదేపదే సమీక్షలు నిర్వహిస్తూ  వివిధ శాఖలు సమన్వయంగా పనిచేసే లా చూసారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి తుఫాను తీరం దాటిన తర్వాతనే ఇంటికి వెళితే  మంత్రి లోకేష్ తెల్లవార్లూ RTGS సెంటర్లోనే ఉండి పరిస్థితి ని సమీక్షిస్తూ వచ్చారు. తుఫాను తీరం దాటినా మరో 48 గంటల పాటు భారీ వర్షాలు  భారీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో  ఇప్పటికీ ప్రభుత్వం, అధికారులు,సిబ్బంది అలర్ట్ గానే ఉన్నారని గవర్నమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే SRDF బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  చురుగ్గా పనిచేస్తున్నాయి.

Read Entire Article