నిధి అగర్వాల్ ఘటనలో కేసు నమోదు

9 hours ago 1
ARTICLE AD

నిన్న బుధవారం సాయంత్రం హైదరాబాద్ లులూమాల్ లో జరిగిన ద రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పై కొంతమంది అభిమానులు పడిపోయి ఆమెను అసభ్యంగా తాకుతూ నిధికి ఊపిరాడకుండా చేసిన ఘటన కలకలం సృష్టించింది. 

లూలూ మాల్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. కేసు నమోదు చేసిన KPHB పోలీసులు

బుధవారం లూలూ మాల్‌లో రాజాసాబ్ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమానికి హాజరైన నిధి అగర్వాల్

అయితే కొందరు దురభిమానులు గుమిగూడి హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇబ్బందికి గురి చేయడంతో సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేశాయి

దీంతో సుమోటోగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన కూకట్ పల్లి పోలీసులు 

నిర్వాహకులతోపాటు మాల్ యాజమాన్యం పైన కేసు నమోదు

ఈవెంట్‌కు సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని వెల్లడించిన పోలీసులు

Read Entire Article