ARTICLE AD
ఘట్టమనేని కుటుంబం నుంచి నవతరం హీరో జయకృష్ణ తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ అన్న రమేష్ బాబు కుమారుడు అయిన జయకృష్ణ టాలీవుడ్ లో అడుగుపెడుతుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. అతడు తన తండ్రి రమేష్ బాబు కంటే భిన్నంగా స్టార్ గా ఎదిగేందుకు ఘట్టమనేని ఫ్యామిలీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ చిత్రానికి ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే జయకృష్ణ లాంటి ఛామ్ ఉన్న హీరో సరసన మేటి కథానాయిక రవీనా టాండన్ నటవారసురాలు రాషా తడానీని ఎంపిక చేయడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. రాషా తడానీ బాలీవుడ్ లో ఇప్పటికే వేవ్స్ క్రియేట్ చేస్తోంది. రాషా అందచందాలు, ఎనర్జీకి యూత్ ఫిదా అయిపోతున్నారు. రాషా ఆరంగేట్ర చిత్రం ఆజాద్ లో తన ప్రతిభతో ఆకర్షించింది. ముఖ్యంగా `ఉయ్ అమ్మా` పాటలో రాషా తడానీ ఎనర్జిటిక్ డ్యాన్సులు రవీనా లోని గ్రేస్ ని ఆవిష్కరించాయి. అందుకే ఇప్పడు జయకృష్ణ సరసన రాషా నటిస్తోంది అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది. తన తల్లి రవీనా లానే రాషా అలరిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.
జయకృష్ణ ఛామింగ్ హీరో. రాషా తడానీ అతడికి తగ్గ జోడీ. అందుకే ఈ జంటను అజయ్ పెద్ద తెరపై ఎలా చూపిస్తారో చూడాలనే ఆసక్తి అందరిలోను ఉంది. రాషా తడానీ కూడా రవీనా టాండన్ తరహాలో లాంగ్ కెరీర్ సాగించాలంటే తన ప్రతిభతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. రవీనాటాండన్ తెలుగులో నాలుగు సినిమాల్లో నటించింది. బంగారు బుల్లోడు లాంటి బ్లాక్ బస్టర్ లో రవీనా నటించింది.

2 weeks ago
2