ధమాకా హిట్టయ్యింది శ్రీలీల వల్ల కాదా

9 months ago 7
ARTICLE AD

రవితేజ-త్రినాథ రావు నక్కిన కలయికలో రెండేళ్లక్రితం వచ్చిన ధమాకా చిత్రం అనుకోకుండా 100 కోట్ల కల్లెక్షన్స్ కొల్లగొట్టి భారీ హిట్ అయ్యింది. దానికి కారణం శ్రీలీల అందాలు, ఆమె డాన్స్ కారణమని అందరూ ముఖ్తకంఠంతో అన్నారు. శ్రీలీల వల్లే ధమాకా 100కోట్లకు చేరువైంది అన్నారు. 

కానీ రైటర్ ప్రసన్న కుమార్ మాత్రం శ్రీలీల వల్ల ధమాకా హిట్ అవ్వలేదు, అందులోని డైలాగ్స్, కథ వల్లే సినిమా హిట్ అయ్యింది అంటున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ధమాకా శ్రీలీల డాన్స్ వల్ల హిట్ అయ్యింది అంటున్నారు, ఏ సినిమా అయినా బాగా పెర్పార్మ్ చేసిందంటే దానికి కారణం క‌థే, సినిమా మొత్తం మీద సాంగ్స్ 20 నిమిషాలు కూడా ఉండవు. 

ఆ 20 నిమిషాల్లో డాన్సులు, గ్లామర్ కనిపిస్తేనే సినిమా హిట్ అవ్వదు. ఆ 20 నిముషాలు ఆడియ‌న్స్ కు మంచి ఎంట‌ర్టైన్మెంట్ దొరికినంత మాత్రాన సినిమా ఆడదు, మిగిలిన రెండు గంట‌ల సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఆడియ‌న్స్ సినిమాను హిట్ చేస్తారు, సినిమా అంతా బావుండి దానికి సాంగ్స్, హీరోయిన్ గ్లామ‌ర్, డ్యాన్సులు కూడా  యాడ్ అయితే సినిమాకు బోన‌స్ అవుతాయి త‌ప్పించి కేవ‌లం గ్లామ‌ర్, డ్యాన్సుల వ‌ల్ల సినిమాలు ఆడ‌వ‌ని ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చాడు.

ధమాకా తర్వాత శ్రీలీల చాలా సినిమాల్లో నటించింది. అందులోను గ్లామర్ గా కనిపించింది, డాన్స్ లు చేసింది. కానీ ఆ సినిమాలేవీ హిట్ అవ్వలేదు కదా అంటూ ప్రసన్న కుమార్ శ్రీలీల ఫ్యాన్స్ ను బాగా హార్ట్ చేసాడు. 

Read Entire Article