దేవర విలన్‌పై దాడి

10 months ago 8
ARTICLE AD

దేవర విలన్ సైఫ్ అలీఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్న సైఫ్ అలీఖాన్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు అలెర్ట్ అయ్యి సైఫ్‌ని హాస్పిటల్‌కు తరలించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో సైఫ్ అలీఖాన్ చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

గురువారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో సైఫ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సైఫ్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగుడు.. ఆ ప్రయత్నం విఫలం కావడంతో.. సైఫ్‌పై దాడి చేసి పరారైనట్లుగా బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సైఫ్ ఇంటికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిజంగా అతను దొంగతనానికే వచ్చాడా? లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా? అనేలా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలను అలెర్ట్ చేసినట్లుగా సమాచారం. 

లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌కు చికిత్స జరుగుతోంది. సైఫ్‌పై జరిగిన దాడి లో రెండు గాయాలు చాలా లోతుగా అయ్యాయని, ఒకటి ఆయన వెన్నుమొకకు దగ్గరగా జరిగిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Entire Article