దేవర 2 కి భారీ ప్లానింగ్ చేస్తోన్న కొరటాల

10 months ago 8
ARTICLE AD

దేవర పార్ట్ 1 బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. రాజమౌళి సినిమా తర్వాత మరో విజయం సాధించడం ఫ్యాన్స్‌కి ప్రత్యేకమైన సంతోషాన్ని ఇచ్చింది. అయితే సినిమా విడుదలై నాలుగు నెలలు గడిచినా.. దేవర 2 కు సంబంధించిన అప్ డేట్ ఏమీ బయటకు రాలేదు.

ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ మరో కొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. 2025 మొత్తం ఈ ప్రాజెక్ట్‌కే సమర్పించబోతున్నాడని సమాచారం.

దేవర సీక్వెల్ విషయంలో కొరటాల శివ ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు టాక్. మొదట అనుకున్న కథలో కొన్ని మార్పులు చేయడం జరిగిందట. ముఖ్యంగా దేవర మరణానికి సంబంధించిన ట్విస్ట్ భైర పాత్రకు సంబంధించిన భీకర ఘట్టాలు మరింత 

ఇంట్రెస్ట్ గా డిజైన్ అవుతున్నాయట.

కేజీఎఫ్ 2, బాహుబలి 2, పుష్ప 2 తరహాలో సీక్వెల్‌లో గూస్‌బంప్స్ వచ్చే విధంగా 3,4 భారీ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. పెద్ద దేవర ఫ్లాష్‌బ్యాక్ కీలకంగా మారనుంది. జన్వీ కపూర్ పాత్రకు కూడా ఈ పార్ట్‌లో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది.

సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించగా.. మరో ముఖ్యమైన విలన్‌గా బాబీ డియోల్ నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రంలోని సంఘటనలు దేవర అదృశ్యమైన తీరును చూపించనున్నారని ఎర్ర సముద్రంపై జరిగిన యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు.

దేవర 1 లో అనిరుద్ ఇచ్చిన పాటలు అద్భుతమైన స్పందన పొందాయి. అయితే సీక్వెల్‌లో ఐదు పాటలు ఉంటాయని సినీ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రం 2027లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అనుకోని మార్పులు జరిగితే తప్ప ముందుగా సినిమాను చూడడం కష్టమే.

Read Entire Article