దెబ్బకు దిగొచ్చిన బండ్ల గణేష్

1 month ago 2
ARTICLE AD

నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేష్ నోటికేదొస్తే అది మాట్లాడేసి తర్వాత నాలుక కరుచుకుని సారీ చెబుతూ ఉంటాడు. ఇదేం అతనికి కొత్త కాదు, సినిమాల విషయమైనా, లేదంటే రాజకీయాల విషయమైనా ఆయన ప్రవర్తన అలానే ఉంటుంది. చాలామంది బండ్ల గణేష్ ని ఆయన మాటలను పట్టించుకోవడం మానేసినా ఒక్కోసారి తమదాకా వస్తే కానీ విషయం అర్ధం కాదు అన్న రీతిలో బాధపడుతూ ఉంటారు. 

తాజాగా K-రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ బండ్ల పై భగ్గుమన్నారు. విజయ్ దేవరకొండ పేరు ఎత్తకపోయినా.. అది విజయ్ ని ఉద్దేశించినవే అని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బండ్ల పై ట్రోల్స్ మొదలు పెట్టారు. 

దెబ్బకు దిగొచ్చిన బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా.. ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.

నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.

మీ బండ్ల గణేష్.. అంటూ రాసుకొచ్చాడు. మరి ఈ వివాదానికి గణేష్ ఫుల్ స్టాప్ పెట్టినట్లే కనిపిస్తుంది. దీనికి విజయ్ ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 

Read Entire Article