దుబాయ్ లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో

11 months ago 7
ARTICLE AD

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు, హీరో శ్రీ సింహ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా దుబాయ్ లో నిన్నరాత్రి ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు, బిజినెస్ మ్యాన్ మురళి మోహన్ మానవరాలు రాగ తో శ్రీ సింహ వివాహాన్ని జరిపించారు. హైదరాబాద్ గోల్కొండ రిజార్ట్స్ లో గత నెలలోనే శ్రీసింహ-రాగ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేసిన విషయం తెలిసిందే. 

ఇక శ్రీసింహ-రాగ ల వివాహాన్ని మురళీ మోహన్ డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ తమ స్థాయికి తగ్గట్టుగా దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఈ పెళ్ళిలో రాజమౌళి ఆయన భార్య రమ డాన్స్ చేసిన వీడియో నిన్న సోషల్ మీడియాని షేక్ చేసింది. 

ఇక శ్రీసింహ-రాగ ల వివాహం దుబాయ్ లో కుటుంబ సభ్యులు, స్నేహతుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిపోయింది. 

Read Entire Article