దిల్ రాజు మళ్లీ రిస్క్ చేస్తున్నాడా..

1 month ago 2
ARTICLE AD

దిల్ రాజు, ఒకప్పుడు తిరుగులేని నిర్మాత. ఆయన సినిమా చేస్తున్నాడు అంటే, మ్యాగ్జిమమ్ ఆ సినిమా హిట్టే అని అంతా అనుకునేవారు. అందుకే ఆయనని సక్సెస్ ఫుల్ నిర్మాత అని అంతా పిలిచేవారు. కానీ కొన్నాళ్లుగా దిల్ రాజు పాచిక పారడం లేదు. ఈ మధ్య కాలంలో వెంకటేష్‌తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తప్పితే.. ఆ బ్యానర్‌కు హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఈ విషయం స్వయంగా దిల్ రాజు కూడా అంగీకరిస్తూ వస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్‌లో పవన్ కళ్యాణ్ ఓజీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన దిల్ రాజు.. ఆ సినిమా మళ్లీ నాకు ఎనర్జీ ఇచ్చిందని పబ్లిగ్గా ప్రకటించారు. 

కాకపోతే, చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? అనేలా ఇప్పుడాయన గురించి టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవును, దిల్ రాజు మళ్లీ బాలీవుడ్ హీరోలపై పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలతో నిర్మాతగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు, ఆ సినిమాలతో హిట్ అందుకోలేకపోయారు. అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలా మరోసారి బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈసారి బడా హీరోలతో ఆయన లైనప్ ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో భారీ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను అక్షయ్ కుమార్‌తో దిల్ రాజు రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే సల్మాన్ ఖాన్‌తో కూడా ఓ భారీ బడ్జెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఈ రెండు సినిమాలతో ఎలాగైనా బాలీవుడ్ హిట్ కొట్టాలని దిల్ రాజు చూస్తున్నారట. చూద్దాం.. ఈ రిస్క్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.. 

Read Entire Article