ది పారడైజ్.. ఇంత నిర్లక్ష్యమా

9 months ago 7
ARTICLE AD

దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ది ప్యారడైజ్ చిత్ర టీమ్ ఎంత నిర్లక్షంగా ఉన్నారో, తాజాగా నాని డిలీట్ చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. రీసెంట్‌గా నాని పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా డేట్ ప్రకటించారు. 3 మార్చి, 2025న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. 

ఇంత వరకు అంతా బాగానే ఉంది. ఆదివారం ఈ టీజర్ విడుదల టైమ్‌ని తెలుపుతూ ఓ పోస్టర్‌ని నాని ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ పోస్టర్‌ని డిలీట్ చేశాడు. కారణం, ఆ పోస్టర్‌పై ఘోరమైన మిస్టేక్ ఉంది. అదేంటంటే, 3.3.23న ఉదయం 11 గంటల 17 నిమిషాలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా ఆ పోస్టర్‌లో ఉంది. పోస్ట్ చేసే వరకు నాని కూడా దీనిని చూసుకోకపోవడం విశేషం.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత చూసుకున్న నాని, వెంటనే ఆ ట్వీట్‌ని డిలీట్ చేసి తర్వాత సరైన డేట్‌ ఉన్న పోస్టర్‌ని పోస్ట్ చేశారు. అయితే అప్పటికే ఆ రాంగ్ పోస్టర్ వైరల్ అవుతూ, టీమ్ నిర్లక్ష్యంపై కామెంట్స్ చేసేలా చేస్తుంది. ఇదే టీమ్ రేపు చిరంజీవి సినిమాకు కూడా పనిచేసే అవకాశం ఉంది. మరి, ఇప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే, మెగాస్టార్ మూవీకి ఏం చేస్తారో అనేలా మెగాభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా, అప్‌డేటెడ్ ప్రపంచంలో ఉన్నప్పుడు కాస్త అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంటూ నానికి ఆయన అభిమానులు సలహాలు ఇస్తున్నారు. 

దసరా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Read Entire Article