దబిడి దిబిడి ట్రోలింగ్‌పై నిర్మాత స్పందనిదే

11 months ago 8
ARTICLE AD

నటసింహం బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ నుండి శుక్రవారం విడుదలైన దబిడి దిబిడి సాంగ్‌పై బీభత్సమైన ట్రోలింగ్ నడుస్తుంది. అదీ కూడా బాలయ్య, ఊర్వశిల డ్యాన్స్‌ స్టెప్స్‌పై ట్రోలింగ్ నడుస్తుండటం విశేషం. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మాములుగా ఏదైనా పాట విడుదలైనప్పుడు సాహిత్యంపై లేదంటే మ్యూజిక్‌పై ట్రోలింగ్ నడుస్తుంటుంది. ఇది ఆ సినిమాలోని పాట ట్యూన్ అని సంగీత దర్శకుడిని, ఇదేం సాహిత్యం అని గీత రచయితని ట్రోల్ చేస్తుండటం ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడు డ్యాన్స్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. ముఖ్యంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో లాస్ట్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా పాటపై కూడా ఇలాగే ట్రోలింగ్ నడిచింది. 

అప్పుడు రామజోగయ్య శాస్త్రి సాహిత్యంపై ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు డాకు మహారాజ్ దబిడి దిబిడి సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో, పైగా గౌరవనీయమైన పదవిలో ఉన్న బాలయ్యతో ఇలాంటి స్టెప్స్ ఏంటి? అంటూ శేఖర్ మాస్టర్‌పై గట్టిగానే ట్రోలింగ్ నడుస్తుంది.

అయితే ఈ ట్రోలింగ్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద blockbuster success అవ్వటానికి ప్రయత్నిద్దాం.. అంటూ నాగవంశీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి నిర్మాత రియాక్ట్ అయ్యాడు కాబట్టి.. ఇకనైనా ట్రోలింగ్ ఆగుతుందేమో చూద్దాం.

Read Entire Article