తేజ స‌జ్జా ప్ర‌పంచ‌వ్యాప్త ఐడెంటిటీకి ప్రూఫ్

1 month ago 3
ARTICLE AD

తేజ స‌జ్జా క‌థానాయ‌కుడిగా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని రూపొందించిన `మిరాయ్` ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా థియేట్రిక‌ల్ విడుద‌ల నుంచి 150కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఒక రైజింగ్ హీరో ఈ స్థాయి వ‌సూళ్లు సాధించ‌డం రికార్డ్. పిల్ల‌లు, కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తోనే ఇది సాధ్య‌మైందని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇప్పుడు మిరాయ్ ఓటీటీలోను సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ జియో హాట్ స్టార్ లో 200 మిలియ‌న్లు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని అధిగ‌మించింద‌ని తెలుస్తోంది. ఇది ఒక రైజింగ్ హీరోకి అసాధార‌ణ‌మైన ఆద‌ర‌ణ‌. ఇప్ప‌టివ‌ర‌కూ మిరాయ్ హిందీ వెర్ష‌న్ ఓటీటీలో విడుద‌ల కాలేదు. దీంతో హిందీ బెల్ట్ లోను అత్య‌ధిక మంది ఓటీటీలో వీక్షించేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా. 

భార‌త్ స‌హా మ‌లేషియా, ఇండోనేషియా, థాయ్ లాండ్ లాంటి చోట్ల `మిరాయ్` చిత్రానికి గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా ప‌లు భాషలలోను అద్భుత వీక్ష‌ణ‌ల తో ప్ర‌జ‌లు ఆద‌రించార‌ని గ్రాఫ్ చెబుతోంది. ఓటీటీలో 2 గంటల 46 నిమిషాల నిడివితో మిరాయ్ స్ట్రీమింగ్ అవుతోంది. 10 అక్టోబ‌ర్ నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇది అందుబాటులోకి వ‌చ్చింది. హిందీ వెర్షన్ నవంబర్ 2025లో విడుదల కానుంది.

Read Entire Article