తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట

3 months ago 13
ARTICLE AD

రెండు రోజుల క్రితం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు ఆ నెక్స్ట్ డే వచ్చారు. కొత్త కోడలు రష్మిక కాకు విజయ్ ఇంట సాదర ఆహ్వానం పలికింది దేవరకొండ ఫ్యామిలీ. ఇక ఈరోజు కొత్త జంట  రష్మిక-విజయ్ దేవరకొండ లు తిరుమల వెళ్లారు.

ఈరోజు ఆదివారం తెల్లవారు ఝామున సుప్రబాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు. కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికలు సంప్రదాయమైన దుస్తుల్లో వెంటకేశ్వరుని దర్శనం చేసుకున్నారు. కొత్త పెళ్లి కూతురు రష్మిక చీర కట్టులో అందంగా మెరిసింది. అక్కడ తిరుమలలో కొత్త జంట తమ వివాహం సందర్భంగా స్వీట్స్ పంచిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. 

ఇక విజయ్ దేవరకొండ స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు విందు ఏర్పాటు చేసారు. ఆతరవాత మార్చి 4 అంటే బుధవారం సాయంత్రం హైదరాబాద్ తాజ్ కృష్ణ లో విజయ్ దేవరకొండ-రష్మిక ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకకు సినీ, రాజకీయనాయకులు హాజరు కానున్నారు. 

Read Entire Article