తమిళనాడు ఎలక్షన్స్ - ఓటు వేసిన ప్రముఖులు

1 month ago 6
ARTICLE AD

ఈరోజు ఏప్రిల్ 23 తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. డీఎంకే, ఏఐడిఎంకె, విజయ్ TVK పార్టీల నడుమ ఉత్కంఠ పోరు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని కసితో కనిపిస్తున్నారు.

ఇక ఈరోజు గురువారం జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గర నుంచి అజిత్ ఆయన భార్య షాలిని, శివరాజ్ కుమార్ ఆయన వైఫ్, సూర్య, జ్యోతిక, కార్తీ, ధనుష్, త్రిష, ఇళయరాజా, సుహాసిని, కమల్ హాసన్, శృతి హాసన్ తదితర సెలబ్రిటీస్ చెన్నై లోని టి నగర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఇక కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఓటు వేసేందుకు వెళ్లేందుకు సరైన ట్రాన్స్ పోర్ట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోయంబత్తూరు పరస్పర ప్రాంతాల్లోని ఓటర్లు బస్సులు లేక ఇబ్బందులు పడుతూ రోడ్ పై బైఠాయించడం హాట్ టాపిక్  అయ్యింది.

Read Entire Article