తండేల్ కి అసలు టెస్ట్

9 months ago 8
ARTICLE AD

నాగచైతన్య కెరీర్‌లోనే తండేల్ అద్భుతమైన ఓపెనింగ్ సాధించి మొదటి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. యూనిట్ నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం మొదటి మూడు రోజులకు గాను ఈ చిత్రం ₹62.37 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నిర్మాత బన్నీ వాస్ ముందుగా ప్రకటించిన ₹100 కోట్ల మార్క్ చేరుకోవాలంటే ఇంకా ₹37 కోట్లు అవసరమవుతున్నాయి.

వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్లు ఎలా కొనసాగుతాయనేది చాలా కీలకం. ఏపీ, తెలంగాణలో మొదటి వారం టికెట్ రేట్లు పెంచినప్పటికీ, ఇప్పుడు యూనిట్ మళ్లీ సాధారణ ధరలకు మారాలని ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయం ఎంతవరకు సినిమాకు ప్లస్ అవుతుందనేది చూడాలి.

సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ సంక్రాంతికి విడుదలైన ఇతర బిగ్ మూవీలతో పోలిస్తే అత్యంత విపరీతమైన బజ్ మాత్రం లేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఎంతవరకు సినిమాను బలంగా ఆదరిస్తారో చూడాలి. నైజాం మార్కెట్‌లో సినిమా బలంగా నిలబడగా హైదరాబాద్ పరిధిలో చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

బుక్ మై షో డేటా ప్రకారం గత 24 గంటల్లో 1.90 లక్షల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడుపోయాయి. ఇది తండేల్పై ఉన్న ఆసక్తిని సూచిస్తున్నప్పటికీ సోమవారం నుంచి గురువారం వరకు సినిమా ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందోననేది కలెక్షన్ల రేంజ్‌ను నిర్ణయించనుంది.

ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లు చేసినప్పటికీ తండేల్ హిందీ మార్కెట్‌లో ఇంకా మెజిక్ చేయాల్సి ఉంది. బాలీవుడ్ ప్రేక్షకులకు పాకిస్థాన్ జైలు నేపథ్యంలో నడిచే కథలపై ఆసక్తి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. నార్త్ ఇండియా మార్కెట్‌లో సినిమా బలపడితేనే ₹100 కోట్ల లక్ష్యం సులభంగా చేరుకోవచ్చు.

తెలుగు మార్కెట్‌లో తండేల్ స్పీడ్ బాగానే ఉంది. అయితే సోమవారం నుంచి గురువారం వరకు సినిమా నిలబడి స్టేడీ కలెక్షన్లు నమోదు చేస్తేనే దీని రేంజ్ పెరుగుతుంది. హిందీ వెర్షన్ పికప్ అయితే మరింత ఉపశమనాన్ని కలిగించనుంది. ఇంకా ముందు ఈ సినిమా ఏ రేంజ్‌లో రాణిస్తుందో వేచిచూడాలి.

Read Entire Article