తండేల్ ఓటీటీ పై క్రేజీ న్యూస్

9 months ago 7
ARTICLE AD

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సాయి పల్లవి జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ తండేల్. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించడంలో విజయవంతమైంది. నాగ చైతన్య కెరీర్‌లో ఇది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఆయనకు మళ్లీ క్రేజ్ తీసుకురావడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. థియేటర్లలో విడుదలైన మొదటి రెండు వారాల నుంచే మంచి కలెక్షన్లు రాబట్టి రన్‌ను కూడా విజయవంతంగా ముగించుకుంది.

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందనే విషయంపై సినీప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం తండేల్ డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని టాక్. అంటే మార్చి 7వ తేదీ శుక్రవారం నుంచి పాన్ ఇండియా భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా బన్నీ వాసు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ నాగ చైతన్య కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Entire Article