డైరెక్ట్‌గా ఓటీటీలోకి దేవ‌ర‌కొండ చిత్రం

1 month ago 2
ARTICLE AD

దేవరకొండ అనగానే విజయ్ దేవరకొండ అనుకుంటారేమో.. ఆయనకి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడనే విషయం తెలియంది కాదు కాబట్టి.. ఇక్కడ దేవరకొండ ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అవును ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల అంటూ అధికారికంగా ప్రకటించారు. కరోనా టైమ్‌లో ఆనంద్ దేవరకొండ చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

ఇప్పుడదే చిత్ర దర్శకుడితో ఆనంద్ దేవరకొండ చేస్తున్న సినిమా కూడా ఓటీటీలోని విడుదలకాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వినోద్ అనంతోజు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి టైటిల్‌ని ప్రకటిస్తూ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు టైటిల్‌గా తక్షకుడు అని ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ గ‌న్ ప‌ట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో ఉన్నారు. గ‌న్‌పై మంట‌ల్లో కాలిపోతున్న కొన్ని గుడిసెలు క‌నిపిస్తుంటే, వేట‌గాడి చ‌రిత్ర‌లో జింక‌పిల్ల‌లే నేర‌స్థులు అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ మరింత ఆస‌క్తిని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read Entire Article