డిఫ్రెంట్ వే లో వారణాసికి రాజమౌళి ప్లాన్స్

2 weeks ago 2
ARTICLE AD

దర్శకధీరుడు రాజమౌళి ఏదైనా పర్ఫెక్ట్ ప్లాన్ తోనే ఉంటారు. సూపర్ స్టార్ తో ఆయన చేస్తున్న వారణాసి సినిమా విషయంలో ఎంతగా ఊరించారో, దానికి మించి వారణాసి టైటిల్ గ్లింప్స్ తో అభిమానులను శాంతపరిచారు. అయితే రాజమౌళి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వారణాసి గ్లింప్స్ కి హాలీవుడ్ రేంజ్ ప్రసంశలు అయితే రాలేదు. కానీ అభిమానూలులైతే హ్యాపీనే. 

అయితే వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్ కి సిద్ధం చేస్తున్నామంటూ కీరవాణి చెప్పేసారు. అంటే మరో ఏడాదిన్నర సినిమా విడుదలకు సమయముంది. కానీ ఇప్పటినుంచే వారణాసి ని రాజమౌళి హాలీవడ్ రేంజ్ లో ప్రమోట్ చెయ్యడమే ఎవ్వరికి ఓ పట్టాన అర్ధం కావడం లేదు. కేవలం టైటిల్ గ్లింప్స్ లోనే బోలెడన్ని అప్ డేట్స్ ని అడక్కుండానే ఇచ్చారు రాజమౌళి. 

అదే మాదిరి సినిమాలోని కీలక పాత్రలైన కుంభ పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని ప్రియాంక చోప్రా, రుద్రా మహేష్ బాబు తో హాలీవుడ్ మీడియాకి ఇంటర్వూ ఇప్పించడం, అందుకు సంబందించిన పిక్స్ ని షేర్ చెయ్యడం చూసి సినిమా విడుదలకు ఏడాదిన్నర సమయం ఉంది ఇప్పటినుంచే ఈ ప్రమోషన్స్ ఏమిటి జక్కన్నా అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

అయితే వారణాసి లాంటి టైటిల్ తో పురాణ కథలను హాలీవుడ్ ఆడియన్స్ కు కనెక్ట్ చెయ్యాలంటే ఈ లెవల్ ప్రమోషన్స్ ఉండాల్సిందే, అందుకే మెయిన్ కేరెక్టర్స్ తో ఇలా మధ్య మధ్యలో ఇంటర్వూస్ ప్లాన్ చెయ్యడం, అలాగే మధ్య మధ్యలో వారణాసి అప్ డేట్స్ వదలడం చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. 

Read Entire Article