డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ విజృంభణ

9 months ago 7
ARTICLE AD

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికగా కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ నెల 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డాకు మహారాజ్ అక్కడ కూడా ట్రెమండస్ రేంజ్‌లో ఆకట్టుకుంటూ భారీ వ్యూస్‌ను రాబట్టింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మలయాళ అభిమానులు బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. రీసెంట్‌గా ఇలాంటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదని బాలయ్య ఎనర్జీ వేరే లెవల్ అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా డాకు మహారాజ్ పాకిస్తాన్ బాంగ్లాదేశ్ UAE వంటి దేశాల్లో టాప్ 2 ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించగా చాందిని చౌదరి ఊర్వశి రౌటేలా బాబీ డియోల్ బేబీ వేద అగర్వాల్ VTV గణేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ ఫైటింగ్ సీక్వెన్స్‌లు పవర్‌ఫుల్ డైలాగ్స్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఈ సినిమాను స్పెషల్‌గా మార్చాయి.

సినిమా కంటెంట్ పరంగా దర్శకుడు బాబీ కొల్లి అద్భుతంగా స్క్రీన్‌ప్లేను అందించడంతో పాటు బాలకృష్ణ క్యారెక్టర్‌ను హైలైట్ చేసేలా ఆకట్టుకునే యాక్షన్ సీన్స్‌ను డిజైన్ చేశాడు. బాలయ్య కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకుంది. మాస్ ప్రేక్షకులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చిన డాకు మహారాజ్ ఎవరూ మర్చిపోలేని చిత్రంగా నిలిచింది.

Read Entire Article