డాకు.. ఏపీ ఇచ్చింది హైకు

11 months ago 8
ARTICLE AD

సంక్రాంతికి వస్తున్న సినిమాలకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్స్ రేట్స్ హైకు ఉండే అవకాశాలైతే కనిపించడం లేదు. అంతగా సీఎం రేవంత్ రెడ్డి పట్టుపట్టేశారు. కానీ ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమాలకు సూపర్ బొనాంజా అనేలా టికెట్ల ధరలతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేశాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు బాలయ్య డాకు మహారాజ్ సినిమాకు కూడా హైక్ ఇస్తూ జీవో విడుదల చేసింది. 

ఈ జీవో ప్రకారం డాకు మహారాజ్ సినిమాకు ఏపీలో జనవరి 12 నుండి 25 వరకు టికెట్ల ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 110కి, మల్లీప్లెక్స్ థియేటర్లలో రూ. 135 పెంచుకునే వెసులుబాటుని కల్పించింది. రోజుకు ఒక అదనపు షో అనుమతిని కూడా ఇచ్చింది. ఉదయం 4 గంటల ప్రత్యేక షోకు అనుమతి ఇస్తూ.. బెనిఫిట్ షో‌కు ఒక్కో టికెట్‌ ధర జీఎస్టీతో కలిపి రూ.500గా ఫిక్స్ చేశారు. దీంతో చిత్రయూనిట్ మాత్రమే కాకుండా.. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హైక్స్‌కు సంబంధించిన జీవో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. 

డాకు మహారాజ్ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని అవతార్‌లో బాలయ్య కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక జనవరి 12న థియేటర్లలో డాకు తాండవమే తరువాయి.. అనేలా నందమూరి ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

Read Entire Article