ట్విస్ట్-కిరణ్ రాయల్ కేసులో లక్ష్మి అరెస్ట్

9 months ago 8
ARTICLE AD

జనసేన తిరుపతి అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణలపై వైసీపీ సోషల్ మీడియా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ తనని మోసం చేసాడు అంటూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వదిలిన వీడియోని అడ్డం పెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా జనసేన నేత పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి పోస్ట్ లు పెట్టింది. 

ఈ వ్యవహారంపై కిరణ్ రాయల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తన మొబైల్ లోని డేటా చోరీ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ కేసు పెట్టాడు. 

తాజాగా కిరణ్ పై ఆరోపణలు చేసిన మహిళ ను అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు.. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తన నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారని లక్ష్మి అనే మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే.. తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మి మీడియా సమావేశం పెట్టి కిరణ్ రాయల్ పై పలు విమర్శలు చేశారు..

ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమెను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.. పలు రాష్ట్రాల్లో ఆమెపై చీటింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.. ఆన్లైన్ మోసం కేసులో ఆమెను అరెస్ట్ చేశారని సమాచారం.. పలు రాష్ట్రాల్లో ఆమెపై చీటింగ్, బ్లాక్మెయిల్ కేసులు.. గత కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆమెను, టీవీలలో కనిపించిన వెంటనే గుర్తించి అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు ఆమెను చెన్నై తరలించనున్నారు.  

Read Entire Article