ARTICLE AD
అమరావతి కి చట్టబద్దత కలిపిస్తూ లోక్ సభ, రాజ్యసభలో బిల్ పాస్ అవుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేస్తే.. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి.. తను అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని కాదు అంటూ మూడు ముక్కలాట అంటే మూడురాజధానుల ఆట ఆడి.. ఇప్పుడు #MAVIGUN కు తెర లేపారు.
మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు మూడు నగరాలను కలిపి #MAVIGUN రాజధానిగా పెడితే బావుంటుంది అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్వుల పాలైతే.. వైసీపీ నేతలు జగన్ అన్న #MAVIGUNని పట్టుకుని ప్రచారం మొదలెట్టారు. మేము అధికారంలోకి వస్తే అమరావతికి చట్టబద్దత లేకుండా చేస్తాము, #MAVIGUN రాజధాని అయితే బావుంటుంది అనే పాట పాడుతున్నారు.
మరోపక్క జగన్, #MAVIGUNపై ట్రోల్స్ వస్తుంటే.. బ్లూ మీడియాలో మాత్రం జగన్ #MAVIGUN అనగానే మచిలీపట్నంలో అప్పుడే రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. మచిలీపట్నంలో భూములు ధరలు పెరగడానికి జగన్ ప్రకటనే కారణం అంటూ అప్పుడే ఊదర గొట్టడం స్టార్ట్ చేసింది. గతంలో రాజధాని విషయంలో జగన్ చేసింది చూసిన ప్రజలెవరూ ఇంకో తప్పు చెయ్యడానికి రెడీ అవ్వరు.
వైజాగ్ రాజధాని అంటూ అక్కడ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ కి రెక్కలు వచ్చేలా చేసిన జగన్ ఇప్పుడు #MAVIGUN అంటూ వైజాగ్ ప్రజలకు షాకిచ్చారు. అక్కడి వైజాగ్ ప్రజలు జగన్ కనిపిస్తే తన్నెట్టుగా ఉన్నారు. ఇప్పుడు #MAVIGUN అంటూ మచిలీపట్నంలో రియల్ ఎస్టేట్ పెరిగింది అంటూ బ్లు మీడియా రాస్తున్న వార్తకు చూసి జోక్ ఆఫ్ ద ఇయర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

1 week ago
2